Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం.. 109 మంది సురక్షితం

Air India flight avoids major mishap and 109 passengers safe
Advertisement
  • శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన
  • టేకాఫ్‌ అయిన ఐదు నిమిషాలకే సాంకేతిక సమస్య
  • విమానాన్ని వెనక్కి మళ్లించిన పైలట్‌
  • అత్యవసరంగా ల్యాండ్‌ అయిన విమానం
  • సాంకేతిక లోపంపై అధికారుల విచారణ
Advertisement
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. టేకాఫ్‌ అయిన ఐదు నిమిషాలకే సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్‌ అప్రమత్తమయ్యారు. విమానాన్ని తిరిగి విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానంలో ఉన్న 109 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

శుక్రవారం శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్‌.. వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) అధికారులకు సమాచారం అందించారు. అనంతరం విమానాన్ని వెనక్కి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు.

పైలట్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. విమానం ల్యాండ్‌ అయిన తర్వాత ఇంజినీరింగ్‌, సాంకేతిక బృందాలు దాన్ని పరిశీలిస్తున్నాయి. సాంకేతిక సమస్యకు గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
Advertisement
Advertisement
Air India
Shamshabad Airport
Emergency Landing
Hyderabad Airport
Technical Glitch
Flight Safety

More Telugu News